
హీరో అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి పై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండి పడుతున్నారు. అల్లు అర్జున్ భార్య పై నెటిజన్ల కు ఎందుకు కోపం అని అనుకుంటున్నారా ? అల్లు స్నేహా రెడ్డి చేసిన ఫోటో షూట్ కారణం. ట్రెండ్ కు తగ్గట్లుగా మోడ్రన్ గా తయారౌతూ ఉంటుంది స్నేహా రెడ్డి. తాజాగా సమంత స్టైలిస్ట్ ప్రీతమ్ జుకేల్కర్ స్నేహా రెడ్డి కి కూడా స్టైలిస్ట్ కావడంతో తాజాగా ఓ ఫోటో షూట్ చేసింది. ఇక ఈ ఫోటోలలో స్నేహా రెడ్డి చాలా హాట్ గా ఉంది.
ఇదే వివాదానికి కారణం అయ్యింది. అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు , హీరో కళ్యాణ్ దేవ్ స్నేహా రెడ్డి ఫోటో చూసి షాక్ అయ్యాడు. దాంతో చాలా హాట్ గా ఉన్నావ్ అంటూ ఎమోజీ కూడా పెట్టాడు. ఇది ఇంకా నెటిజన్లను మండిపోయేలా చేసింది దాంతో స్నేహా రెడ్డి పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అల్లు అర్జున్ – స్నేహా రెడ్డి ప్రేమించి పెళ్ళి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరికీ ఇద్దరు పిల్లలు. చాలా సంతోషకరమైన జీవితం. అల్లు అర్జున్ ని అమితంగా ఇష్టపడే అభిమానులు కోకొల్లలు. అయితే స్నేహా రెడ్డి మాత్రం ఇలా అందాల ప్రదర్శన చేయడంతో ఆగ్రహం గా ఉన్నారు.