అల్లు వారి పేరు కలకాలం గుర్తుండేలా బాగానే ప్లాన్ చేసారు. అల్లు స్టూడియోస్ పేరుతో సినిమా , వెబ్ సిరీస్ , సీరియల్ ల కోసం ఏకంగా స్టూడియో నిర్మించింది అల్లు కుటుంబం. అల్లు రామలింగయ్య వారసుడు అల్లు అరవింద్ కాగా అతడి వారసులు అల్లు బాబీ , అల్లు అర్జున్ , అల్లు శిరీష్. దాంతో అల్లు స్టూడియోస్ పేరుతో గండిపేటలో 10 ఎకరాలలో స్టూడియో నిర్మించారు.
ఈ స్టూడియో నిర్మాణం పూర్తి కావడంతో అక్టోబర్ 1 న ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. విశిష్ట అతిథుల చేతుల మీదుగా ఈ స్టూడియో ప్రారంభం కానుంది. ఈ ప్రారంభ వేడుకల్లో అల్లు కుటుంబంతో పాటుగా మెగా కుటుంబం కూడా పాల్గొననుంది. మెగాస్టార్ చిరంజీవి ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా హాజరు కానున్నాడు.
ఇలా స్టూడియో నిర్మించాలనే ఆలోచనకు రావడానికి కారణం ఏంటో తెలుసా ….. ఓసారి షూటింగ్ కోసం అల్లు అర్జున్ అన్నపూర్ణ స్టూడియోస్ కు వెళ్ళాడు. ఆ సమయంలో అక్కడున్న సిబ్బంది వెల్ కం టు అన్నపూర్ణ స్టూడియోస్ సార్ అన్నారట. అరె ! ఇదేదో బాగుందే …… మనకు కూడా ఓ స్టూడియో ఉంటే ఇలాగే అంటారు కదా ! మన అల్లు పేరు పలుకుతుంటే వైబ్రేషన్స్ వస్తాయి కదా ! అని ఇలా ఈ స్టూడియోకు శ్రీకారం చుట్టాడట అల్లు అర్జున్.