
నటీనటులు : నందమూరి కళ్యాణ్ రామ్ , బ్రహ్మాజీ ఆశికా రంగనాథ్
సంగీతం : జిబ్రాన్
నిర్మాణం : మైత్రి మూవీ మేకర్స్
దర్శకత్వం : రాజేంద్ర రెడ్డి
విడుదల తేదీ : 10 ఫిబ్రవరి 2023
రేటింగ్ : 3/ 5
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన చిత్రం ” అమిగోస్ ”. బింబిసార వంటి బ్లాక్ బస్టర్ తర్వాత హీరో కళ్యాణ్ రామ్ నటించిన చిత్రం కావడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. మరి ఆ అంచనాలను ఈ సినిమా అందుకుందా ? లేదా ? తెలియాలంటే కథ లోకి వెళ్లాల్సిందే.
కథ :
హైదరాబాద్ కు చెందిన వ్యాపారి సిద్దార్థ్ ( నందమూరి కళ్యాణ్ రామ్ ) ఆర్జే ఇషిక ( ఆశికా రంగనాథ్ ) ను ఇష్టపడతాడు. ఆమెను పెళ్లి చేసుకునే క్రమంలో తనలాగే ఉండే మరో ఇద్దరి గురించి తెలుసుకుంటాడు. ఆ ఇద్దరిలో ఒకరు బెంగుళూర్ లో పనిచేసే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మంజునాథ్ ( కళ్యాణ్ రామ్ ) కాగా మరొకరు బిపిన్ రాయ్ అలియాస్ మైఖేల్ ( కళ్యాణ్ రామ్ ) . ఈ ముగ్గురూ గోవాలో కలుసుకుంటారు. ఎన్ ఐ ఏ అధికారిని చంపిన మైఖేల్ ఆ నేరం సిద్దార్థ్ మీద నెట్టాలని చూస్తాడు. సిద్దార్థ్ ఆ నేరంలో అరెస్ట్ అయ్యాడా ? మైఖేల్ ఆట కట్టించారా ? చివరకు ఏమైంది అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
హైలెట్స్ :
నందమూరి కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం
యాక్షన్ సీన్స్
డ్రా బ్యాక్స్ :
స్క్రీన్ ప్లే
నటీనటుల ప్రతిభ :
నందమూరి కళ్యాణ్ రామ్ మూడు పాత్రల్లో కూడా ఇరగదీసాడు. వ్యాపారవేత్తగా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా అలాగే విలన్ పాత్రలో మైఖేల్ గా అన్ని పాత్రల్లో రాణించాడు. ముఖ్యంగా విలన్ పాత్రలో చాలా బాగా చేసాడు. మూడు పాత్రల్లో కూడా వేరియేషన్స్ చూపించాడు. ఇక హీరోయిన్ ఆశికా రంగనాథ్ కు పెద్దగా ప్రాముఖ్యత లేదు. ఉన్నంతలో మెప్పించింది. బ్రహ్మాజీ , సప్తగిరి తదితరులు తమతమ పాత్రల పరిధి మేరకు నటించారు.
సాంకేతిక వర్గం :
జిబ్రాన్ అందించిన సంగీతం ఈ సినిమాకు హైలెట్ గా నిలిచింది. నేపథ్య సంగీతం అలాగే ” ఎన్నో రాష్త్రులొస్తాయి ” అనే రీమిక్స్ సాంగ్ తో అదరగొట్టాడు. సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ సినిమాకు చాలా ప్లస్ అయ్యింది. ఇంకా కొన్ని సన్నివేశాలను ఎడిట్ చేయొచ్చు. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇక దర్శకుడు రాజేంద్ర రెడ్డి విషయానికి వస్తే …… మంచి కథ ఎంచుకున్నాడు కానీ ఆ కథకు తగ్గట్లుగా స్క్రీన్ ప్లే రాసుకోలేకపోయాడు. దాంతో ఫస్టాఫ్ యావరేజ్ గా సెకండాఫ్ మెప్పించేలా ఉంది. ఓవరాల్ గా డైరెక్టర్ ఫరవాలేదనిపించాడు.
ఓవరాల్ గా :
ఓసారి చూడొచ్చు.