రౌడీ హీరో విజయ్ దేవరకొండ రిజెక్ట్ చేసిన కథే ” అమిగోస్ ” అని తెలుస్తోంది. విజయ్ దేవరకొండ ఈ కథ విన్నాకా మొదట చేద్దామని చెప్పినప్పటికీ లైగర్ ఇచ్చిన షాక్ తో అమిగోస్ డైరెక్టర్ కు నో చెప్పాడట దాంతో ఈ కథను పట్టుకొని నందమూరి కళ్యాణ్ రామ్ దగ్గరకు వెళ్ళాడు దర్శకుడు రాజేంద్ర రెడ్డి. ఇంకేముంది కొత్తదనం ఎక్కడున్నా సరే వాళ్లకు ఛాన్స్ ఇచ్చే హీరోలలో మొట్టమొదటి స్థానంలో ఉంటాడు హీరో నందమూరి కళ్యాణ్ రామ్.
రాజేంద్ర రెడ్డి చెప్పిక కథ నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇంకేముంది పట్టాలెక్కింది ……. ఈనెల 10 న విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం పోషించాడు. టీజర్ , ట్రైలర్ విభిన్నంగా ఉండటంతో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి. ఇక ఆ అంచనాలను అందుకుంటే సినిమా సూపర్ హిట్ అవుతుంది. విజయ్ దేవరకొండ చేసింది తప్పా ? ఒప్పా ? అనేది ఈనెల 10 న తేలనుంది.
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించగా ఆషిక రంగనాథ్ హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమాలో ఎన్నో రాత్రులొస్తాయి గానీ రాదీ వెన్నెలమ్మ అనే పాటను రీమిక్స్ చేసారు. నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ధర్మక్షేత్రం చిత్రంలోని పాట అది. బాలయ్య బాబాయ్ సినిమాలోని పలు పాటలను కళ్యాణ్ రామ్ రీమిక్స్ చేస్తున్నాడు సినిమాలు హిట్ కొడుతున్నాడు. మరి ఈ అమిగోస్ ఈ కేటగిరీలో నిలుస్తుందో చూడాలి.
ఇటీవలే బింబిసార చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు నందమూరి కళ్యాణ్ రామ్. పైగా ఆ సినిమా సొంత సినిమా. కళ్యాణ్ రామ్ కష్టానికి మంచి ప్రతిఫలం దక్కింది. ఆ సినిమా తర్వాత వస్తున్న సినిమా కావడంతో అమిగోస్ పై మంచి అంచనాలే ఉన్నాయి. ఆ అంచనాలను అందుకుంటే తప్పకుండా హిట్ కొడతాడు. కళ్యాణ్ రామ్ తీసుకున్న నిర్ణయం సరైనదేనా ? లేదా ? అన్నది ఈనెల 10 న తేలనుంది.