
ఆంటీ అని తనని అవమానకరంగా పిలిచిన అందరిపై కేసు పెట్టింది హాట్ భామ అనసూయ. అంతేకాదు అందరిపై కేసు పెట్టాను అంటూ సోషల్ మీడియాలో వెల్లడించింది కూడా. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది అనసూయ. గత నాలుగు రోజులుగా సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ తో అలాగే ఇతర నెటిజన్లతో అనసూయ తలపడుతోంది.
విజయ్ దేవరకొండ నటించిన లైగర్ చిత్రం ఈనెల 25 న విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా పేరు ఎక్కడా ప్రస్తావించలేదు అనసూయ. కానీ ఉసురు ఊరికే పోదు అని వ్యాఖ్యానించి విజయ్ దేవరకొండ అభిమానులను రెచ్చగొట్టింది. ఇంకేముంది సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే జరిగింది.
అనసూయ పై చాలామంది బూతుల వర్షం కురిపించారు. అయితే ఎవరు ఎంతగా విమర్శించినా అనసూయ మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గలేదు. సై అంటే సై అంటూ కయ్యానికి కాలు దువ్వింది. దాంతో హోరాహోరీ యుద్ధమే నడిచింది. అయితే తనని ఆంటీ అని అవమానించిన వాళ్లపై కేసు పెట్టాలని ఫిక్స్ అయిన అనసూయ ఎట్టకేలకు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. దాంతో కేసు నమోదు చేసుకున్నారు. అనసూయ కూడా పలు ట్వీట్ లను స్క్రీన్ షాట్ లు చేసి పెట్టుకోవడమే కాకుండా పోలీసులకు అందించింది. దాంతో దర్యాప్తు సాగుతోంది.