
హాట్ భామ అనసూయ చెల్లి కూడా తన అక్క బాటలోనే అడుగు పెడుతోంది. బుల్లితెరపై హాట్ ఫోజులతో కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెడుతోంది అనసూయ. యాంకర్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకుంది. కట్ చేస్తే ఇప్పుడు అదేబాటలో పయనిస్తోంది అనసూయ చెల్లెలు వైష్ణవి. అక్క లాగే యాంకర్ గా ఓ వెలుగు వెలగాల ని భావిస్తోంది వైష్ణవి.
ఈ భామకు అనసూయ రికమెండేషన్ ఉండటంతో వైష్ణవిని ఓ ప్రోగ్రాం లో యాంకర్ గా ఫిక్స్ చేశారట. ఇక వైష్ణవి కూడా అక్క అనసూయ లాగే అందాల ప్రదర్శన తో కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెట్టడానికి సమాయత్తం అవుతోంది. అయితే అక్క అనసూయ రికమెండేషన్ బాగానే ఉంది కాని …… అనసూయ లాగే బుల్లితెరపై అదరగొడుతుందా ? లేదా ? అన్నది ముందు ముందు తెలియనుంది.