మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ యాంకర్ లలో అగ్రభాగాన ఉంది ”మాచిరాజు ప్రదీప్ ” అనే విషయం తెలిసిందే. గతకొంత కాలంగా ప్రదీప్ పెళ్లి గురించి రకరకాల వార్తలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. అలాగే ఆ వార్తలను కొట్టి పడేస్తూనే ఉన్నాడు ప్రదీప్. అయినా ఈ పెళ్లి వార్తల ప్రవాహం మాత్రం తగ్గలేదు. తాజాగా మళ్ళీ ప్రదీప్ పెళ్లి గురించి ఊహాగానాలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ” నవ్య మారోతు ” ను పెళ్లాడనున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి.
ఇంతకీ ఈ నవ్య మారోతు ఎవరో తెలుసా …… ప్రదీప్ మాచిరాజు కు గతకొంత కాలంగా కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేస్తోంది. ప్రదీప్ కు మాత్రమే కాకుండా పలువురు సెలబ్రిటీలకు అలాగే బిగ్ బాస్ కంటెస్టెంట్ లకు కూడా కాస్ట్యూమ్ డిజైనర్ గా వ్యవహరిస్తోంది. ప్రదీప్ చాలా కార్యక్రమాలకు హోస్ట్ గా వ్యవహరిస్తుంటాడు దాంతో రకరకాల కాస్ట్యూమ్స్ వాడుతుంటాడు. ఇంకేముంది అలా ప్రదీప్ కు నవ్యకు మంచి స్నేహం ఏర్పడటం …… ఆ స్నేహం ప్రేమగా మారినట్లు తెలుస్తోంది.
ఇక ఈ ఇద్దరి ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పగా ఇంట్లో వాళ్ళు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అయితే నవ్య ఇతర మతస్తురాలు అనే విషయం తెలుస్తోంది. అయితే ప్రేమకు కులం , మతం అనేది కొంతమందికి మాత్రమే అడ్డుగోడగా నిలుస్తుంది……. మరికొంతమందికి ఎలాంటి అడ్డంకులు సృష్టించదు. అదే జరిగిందట ప్రదీప్ – నవ్య జంటకు. అయితే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.