హాట్ యాంకర్ గా అదరగొడుతున్న భామ విష్ణు ప్రియ. బుల్లితెరపై మాత్రమే కాకుండా వెండితెరపై కూడా సత్తా చాటాలని చూస్తున్న ఈ హాట్ భామ సోషల్ మీడియా అకౌంట్ లో సడెన్ గా బూతు బొమ్మలు దర్శనం ఇవ్వడంతో షాక్ అయ్యారు నెటిజన్లు. నగ్న చిత్రాలు,అలాగే వీడియోలు తన అకౌంట్ లో ఎవరో కావాలనే పోస్ట్ చేస్తున్నారని , అలాంటి వాటి వల్ల ఇబ్బందిపడిన వాళ్లకు క్షమాపణ చెప్పింది విష్ణుప్రియ .
అంతేకాదు ఆ అకౌంట్ ని అన్ ఫాలో చేయండి …… ఎందుకంటే నా అకౌంట్ హ్యాక్ అయ్యింది. అప్పటి నుండి ఇలాంటి వాటిని పోస్ట్ చేస్తున్నారు. నా అకౌంట్ మళ్ళీ నాచేతికి ఎప్పుడు వస్తుందో తెలియదు అందుకే ప్రస్తుతానికి అన్ ఫాలో చేయండి అని ఓ వీడీయో విడుదల చేసింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే విష్ణుప్రియ బుల్లితెరపై సత్తా చాటుతోంది. ఇక సినిమాల్లో కూడా జోరు చూపించాలని గట్టి ప్రయత్నాలే చేస్తోంది. కానీ అదృష్టం మాత్రం వరించడం లేదు పాపం ఈ భామకు.