మహేష్ బాబు హీరోగా నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రంపై సంచలన వ్యాఖ్యలు చేసింది నటి సంగీత. ఆ సినిమా చేయడం వల్ల నాకు చాలా మైనస్ అయ్యిందని వ్యాఖ్యానించింది. డైరెక్టర్ అనిల్ నాకు కథ చెప్పాడు . అయితే కథ చెప్పినప్పుడు ఒకలా అనిపించింది తీరా సినిమా షూటింగ్ లో ఒకలా అనిపించింది. అయినా అతడు ఒత్తిడి చేయడంతో షూటింగ్ పూర్తి చేశాను. తీరా చూస్తే …… డైరెక్టర్ అనిల్ కనిపిస్తే ఒరేయ్ …… ఇలా చేసావేంట్రా ? అని అనాలనిపిస్తోంది అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది సంగీత.
ఒకప్పుడు హీరోయిన్ గా నటించిన సంగీత పెళ్లి చేసుకొని కొన్నాళ్ళు సినిమాలకు దూరమైంది. అయితే మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు చిత్రంలో మహేష్ బాబు అత్తగా నటించి షాక్ ఇచ్చింది. ఇందులో రష్మిక మందన్న తల్లిగా నటించిన విషయం తెలిసిందే. అయితే సరిలేరు నీకెవ్వరు చిత్రంలో నటించడం నాకు మైనస్ అయ్యిందని అంటోంది సంగీత.
మరి ఈ మాటలు డైరెక్టర్ అనిల్ వింటే ఎలా స్పందిస్తాడో చూడాలి. ఓ డైరెక్టర్ ను పట్టుకొని రేయ్ ….. ఇలా చేసావేంట్రా నన్ను అంటే తప్పకుండా బాధపడతారు. తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది సంగీత. ఆ ఇంటర్వ్యూలో ఇలా వ్యాఖ్యానించింది. ఇది అనిల్ చూస్తే బాధపడటం ఖాయం.