డార్లింగ్ ప్రభాస్ ఆదిపురుష్ మరో వివాదంలో చిక్కుకుంది. ఇప్పటికే టీజర్ విషయంలో పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొన్న ఆదిపురుష్ టీమ్ ఇప్పుడు మరో వివాదాన్ని ఎదుర్కొంటోంది. ఇంతకీ తాజా వివాదం ఏంటంటే…… ఆదిపురుష్ టీజర్ సెన్సార్ కాకుండానే విడుదల చేసారని, అలాగే సీత పాత్రధారి కృతి సనన్ వస్త్రధారణ కూడా అభ్యంతరకరంగా ఉందంటూ అలహాబాద్ హైకోర్టుని ఆశ్రయించారు. ఇంకేముంది ధర్మాసనం ఆదిపురుష్ టీమ్ కు నోటీసులు జారీ చేసింది.
సీత పాత్రలో కృతిసనన్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఆమె వస్త్రధారణ సీతమ్మ తల్లిని అవమానించేలా ఉందని ఆరోపిస్తున్నారు. ఇక అంతకుముందు రాముడి గెటప్ ఆశించిన స్థాయిలో లేదని, రావణాసురుడు పాత్రధారి పోషించిన సైఫ్ అలీఖాన్ , హనుమంతుడు పాత్ర వేశాలపై కూడా తీవ్ర నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. మొత్తానికి ఆదిపురుష్ టీజర్ సినిమాలా కాకుండా యానిమేషన్ మూవీ లాగా ఉందని విమర్శలు రావడంతో సినిమా విడుదల వాయిదా వేశారు. ఇప్పుడు కోర్టు రూపంలో మరో ఇబ్బంది తలెత్తింది దాంతో ఈ ఏడాది ఆదిపురుష్ చిత్రం విడుదల అవుతుందా ? అనే అనుమానం కలుగుతోంది.