నందమూరి కుటుంబం నుండి మరో హీరో వస్తున్నాడు. ఇప్పటికే నందమూరి కుటుంబం నుండి బాలకృష్ణ , జూనియర్ ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ లు హీరోలుగా రాణిస్తున్నారు. ఆ కోవలో మరో హీరో తెరంగేట్రం చేయడానికి సిద్దమైపోయాడు. ఆ హీరో పేరు ఏంటో తెలుసా ……. నందమూరి చైతన్య కృష్ణ. BTR క్రియేషన్స్ పతాకంపై కృష్ణ ఆకెళ్ళ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది.
అసలు గతంలోనే నందమూరి చైతన్య కృష్ణ ఒక చిత్రంలో హీరోగా నటించాడు. కాకపోతే సోలో హీరోగా కాకుండా నలుగురిలో ఒక హీరోగా నటించాడు. ఆ సినిమా అట్టర్ ప్లాప్ అయ్యింది. దాంతో మళ్ళీ సినిమాల్లో నటించలేదు. కట్ చేస్తే దాదాపు 19 సంవత్సరాల తర్వాత మళ్ళీ హీరోగా తెరంగేట్రం చేస్తున్నాడు.
మార్చి 5 న ఈ సినిమా టీజర్ ను విడుదల చేయనున్నారు. నందమూరి చైతన్య కృష్ణ హీరోగా నిలదొక్కుకుంటాడా ? అంటే డౌటే కానీ ఆ ఫ్యామిలీ నుండి మాత్రం మరో హీరో వస్తున్నాడు ప్రేక్షకుల ముందుకు. ప్రేక్షకులు ఆశీర్వదిస్తే హిట్ కొడతాడు …. లేదంటే షరా మాములే. వారసత్వం అనేది ఒక ఎంట్రీగా ఉపయోగపడుతుంది కానీ ప్రేక్షకులను మెప్పిస్తేనే స్థానం దక్కించుకునేది.
Production No.1 from @BTRCreations 💥
Brace Yourselves for the Title Launch on March 5th 🤩
🌟ing #NandamuriChaitanyaKrishna 🤩
A film by @VKrishnaakella 🎬
𝙀𝙫𝙚𝙧𝙮 𝙨𝙞𝙣𝙣𝙚𝙧 𝙣𝙚𝙚𝙙𝙨 𝙩𝙧𝙚𝙖𝙩𝙢𝙚𝙣𝙩 pic.twitter.com/1IvnIv8Djk
— Basavatarakarama Creations (@BTRcreations) March 3, 2023