
టాలీవుడ్ లో వరుసగా మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. గత ఏడాది పలువురు సినీ ప్రముఖులు చనిపోగా అదే పంథా కొత్త ఏడాదిలో కూడా కొనసాగుతూ ఉంది. యువ నటుడు సుధీర్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన సంచలనం సృష్టిస్తోంది. సెకండ్ హ్యాండ్ , కుందనపు బొమ్మ అనే చిత్రాల్లో అలాగే , షూటౌట్ ఎట్ ఆలేరు అనే వెబ్ సిరీస్ లో నటించాడు సుధీర్. వైజాగ్ కు చెందిన సుధీర్ సినిమా అవకాశాల కోసం గట్టి ప్రయత్నాలే చేసాడు.
అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. ఇక వచ్చిన అవకాశాలు కూడా సుధీర్ కు పెద్దగా ఉపయోగపడలేదు. దానికి తోడు వ్యక్తిగత విషయాలు కూడా గందరగోళంగా తయారవ్వడంతో ఈరోజు ఉదయం ఆత్మహత్య చేసుకున్నాడని తెలుస్తోంది. ఈ విషయాన్ని నటుడు సుధాకర్ కోమాకుల తన ఫేస్ బుక్ లో వెల్లడించాడు. కుందనపు బొమ్మ అనే చిత్రంలో సుధాకర్ తో పాటుగా సుధీర్ కూడా నటించాడు.