టాలీవుడ్ లో మరో విషాదం నెలకొంది. దర్శకుడు మదన్ బ్రెయిన్ స్ట్రోక్ తో మరణించాడు. ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్ తో హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చేరాడు మదన్. అయితే ఈరోజు నవంబర్ 19 న రాత్రి ఆరోగ్యం విషమించడంతో మరణించాడు. ఈ విషయాన్ని డాక్టర్లు అధికారికంగా కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. ఆ నలుగురు చిత్రానికి రచన అందించిన మదన్ జగపతి బాబు – ప్రియమణి జంటగా నటించిన పెళ్ళైన Kకొత్తలో చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత ప్రవరాఖ్యుడు , గుండె ఝల్లుమంది, గరం , గాయత్రి తదితర చిత్రాలకు దర్శకత్వం వహించాడు. మదన్ అకాల మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Breaking News