టాలీవుడ్ లో మరో విషాదం నెలకొంది. ఈరోజు తెల్లవారు జామున రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణించడంతో టాలీవుడ్ శోకసంద్రంలో మునిగింది. ఆ షాక్ నుండి కోలుకోకముందే ప్రముఖ సంగీత దర్శకులు మణిశర్మ తల్లి సరస్వతి (88) మరణించింది. గతకొంత కాలంగా సరస్వతి అనారోగ్యంతో బాధపడుతున్నారు.
చెన్నై లో మణిశర్మ సోదరుడి నివాసంలో కన్నుమూశారు. దాంతో మణిశర్మ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మణిశర్మ 90 వ దశకంలో స్టార్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, డాక్టర్ రాజశేఖర్ లు నటించిన చిత్రాలకు సంగీతం అందించారు. తల్లి మరణంతో మణిశర్మ తీవ్ర దుఃఖసాగరంలో మునిగారు.