సిద్దూ జొన్నలగడ్డ అలియాస్ డీజే టిల్లు కు హీరోయిన్ ల సమస్య తలెత్తుతోంది. ఇప్పటికే నేహా శెట్టిని తొలగించారు. ఆమె స్థానంలో శ్రీలీలను తీసుకోవాలని అనుకున్నారు. అయితే ఏమయిందో ఏమో శ్రీలీల స్థానంలో అనుపమ పరమేశ్వరన్ ను తీసుకున్నారు. అంతేకాదు అఫీషియల్ గా అనౌన్స్ చేసారు కూడా. అయితే తాజాగా వినబడుతున్న కథనం ప్రకారం అనుపమ పరమేశ్వరన్ డీజే టిల్లు నుండి తప్పుకుందట.
దాంతో మరొక హీరోయిన్ ను ఎంపిక చేసే పనిలో పడ్డారు డీజే టిల్లు బృందం. ప్రేమమ్ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సెబాస్టియన్ మడోన్నా ను తాజాగా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. మరి ఈ భామ అయినా ఉంటుందా ? లేక మరొక హీరోయిన్ వచ్చి చేరుతుందా ? చూడాలి.
హీరోయిన్ లు ఈ సినిమా నుండి తప్పుకోవడానికి కారణం ఏంటంటే …… కాస్త రొమాంటిక్ సన్నివేశాలు ఎక్కువగానే ఉన్నాయట. అంతేకాదు ఘాటు కౌగిలింతలు , లిప్ లాక్ లు కూడా ఉన్నాయట దాంతో కొంతమంది హీరోయిన్ లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారన్న మాట. కొన్ని సన్నివేశాలకు ఓకే కానీ మరీ ఎక్కువగా ఉంటే కష్టమే కదా ! అని అంటున్నారట. డీజే టిల్లు మొదటి భాగం బ్లాక్ బస్టర్ కావడంతో రెండో భాగంపై బాగానే అంచనాలున్నాయి. అయితే ఇలా వరుస అడ్డంకులు వస్తూనే ఉన్నాయి.