
అనుపమ పరమేశ్వరన్ రెమ్యునరేషన్ భారీగా పెంచింది. ఇంతకుముందు వరకు సినిమాకు కేవలం 50 నుండి 60 లక్షల వరకు మాత్రమే తీసుకునే ఈ భామ వరుసగా రెండు సక్సెస్ లతో జోరు మీదుంది. దాంతో సక్సెస్ ఉన్నప్పుడే రెమ్యునరేషన్ పెంచాలని భావించిన ఈభామ ఏకంగా కోటి 20 లక్షలు డిమాండ్ చేస్తోందట. ఒక్కసారిగా రెమ్యునరేషన్ డబుల్ చేయడంతో దర్శక నిర్మాతలు ఖంగుతిన్నారట.
నిఖిల్ హీరోగా నటించిన కార్తికేయ 2 చిత్రంలో అలాగే 18 పేజెస్ చిత్రంలో నటించింది అనుపమ పరమేశ్వరన్. కార్తికేయ 2 పాన్ ఇండియా చిత్రంగా సంచలనం సృష్టించింది. ఇక 18 పేజెస్ కూడా మంచి విజయం సాధించింది. దాంతో రెండు విజయాలు అందుకున్నాను కాబట్టి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్న చందంగా భారీగా రెమ్యునరేషన్ పెంచేసింది. ఇప్పుడు ఏకంగా ఒక్కో సినిమాకు 1.20 కోట్లు డిమాండ్ చేస్తోంది.
ఇక డిమాండ్ ఉన్న వాళ్ళను పెట్టుకోవాలి …….. సక్సెస్ వెంట పడాలి అని అనుకునే వాళ్ళు అనుపమ పరమేశ్వరన్ ని ఏరికోరి ఎంచుకుంటున్నారు. డిమాండ్ అండ్ సప్లై సూత్రం ప్రకారం అనుపమ డిమాండ్ చేస్తున్న దాంట్లో తప్పేమి లేదని అంటున్నారు ఇది తెలిసిన వాళ్ళు.