నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న షో అన్ స్టాపబుల్ 2. మొదటి సీజన్ బ్లాక్ బస్టర్ కావడంతో రెండో సీజన్ స్టార్ట్ చేశారు. ఇప్పటికే ఈ రెండో సీజన్ లో పలువురు స్టార్స్ పాల్గొనగా తాజాగా ఆ లిస్ట్ లో హాట్ భామలు అనుష్క , సమంత పాల్గొననున్నట్లు తెలుస్తోంది.
సాలిడ్ అందాల భామ అనుష్క గత కొంత కాలంగా పెద్దగా సినిమాలు చేయడం లేదు. నిశ్శబ్దం అనే సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకుంది. ప్రస్తుతం నవీన్ పొలిశెట్టి సరసన ఓ చిత్రంలో నటిస్తోంది. ఇక బాలయ్య సరసన కూడా ఒక్క మగాడు అనే చిత్రంలో నటించింది అనుష్క. దాంతో బాలయ్య అనుష్క ను కాస్త ఆట పట్టించడం ఖాయం.
ఇక సమంత విషయానికి వస్తే ….. ఇటీవలే యశోద చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పెద్ద హిట్ కాలేదు కానీ ఫరవాలేదనిపించుకుంది. ఇక మాయో సైటిస్ అనే వ్యాధితో బాధపడుతోంది. దాంతో బాలయ్య షోలో ఈ వ్యాధి గురించి అలాగే చైతూ తో విడాకుల గురించి కూడా టాపిక్ రావచ్చని తెలుస్తోంది. ఈ ఇద్దరి రాకతో బాలయ్య షోకు మరింత గ్లామర్ యాడ్ అవ్వనుంది.