సాలిడ్ అందాల భామ అనుష్క అందాలను గుడ్లప్పగించి మరీ చూస్తుండి పోయానని , ఆమె అందాలు ఒక్క.క్షణం నన్ను మాయ చేశాయని అంటున్నాడు అవధాని గరికపాటి. అయితే ఈ మాటలు ఇప్పటివి కాదు సుమా ! కొన్నాళ్ల క్రితం తన కొడుకుతో కలిసి టీవీ చూస్తున్న క్రమంలో ఒక్కసారిగా అనుష్క స్క్రీన్ పై కనిపించిందట. ఆ సమయంలో అనుష్క అందాలకు చలించిపోయాడట అవధాని. ఇదే విషయాన్ని ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో కు వర్మ మరింత సెగ తగిలేలా చేసాడు. ఆ వీడియోకు అసభ్యకరమైన మరో వీడియో కూడా జత చేసాడు. దాంతో మరింత దుమారం రేగింది.
ఇటీవల కాలంలో చిరంజీవి పై అవధాని గరికపాటి వ్యాఖ్యానించిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దాంతో మెగా అభిమానులు గరికపాటి పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అతడిని అదేపనిగా ట్రోల్ చేస్తున్నారు. దాంతో ఆ దాడిని తట్టుకోలేక పోయాడు గరికపాటి. చిరంజీవి కి బహిరంగంగా క్షమాపణలు చెప్పాడు. అయినా ఆ గొడవ చల్లారలేదు. దాంతో రచ్చ రచ్చ అయ్యింది.