సాలిడ్ అందాల భామ అనుష్క శెట్టి చాలా రోజుల తర్వాత గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన చిత్రం ” మిస్ శెట్టి – మిస్టర్ పొలిశెట్టి ”. యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి హీరోగా నటిస్తుండగా అనుష్క హీరోయిన్ గా నటిస్తోంది. యువ దర్శకుడు మహేష్ బాబు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఈరోజు టైటిల్ అనౌన్స్ చేయడమే కాకుండా సమ్మర్ లో విడుదల అని ప్రకటించారు.
రిలీజ్ డేట్ ప్రత్యేకంగా అనౌన్స్ చేయలేదు కానీ సమ్మర్ అని ప్రకటించడంతో ఏప్రిల్ కావచ్చు లేదంటే మేలో అయినా రిలీజ్ కావచ్చు అని తెలుస్తోంది. అసలు ఈ సినిమా షూటింగ్ జరుగుతోందా ? అనే అనుమానం ఉండేది కానీ అకస్మాత్తుగా సమ్మర్ లో విడుదల అని ప్రకటించడంతో అనుష్క అభిమానులు షాక్ అయ్యారు.
బాహుబలి తర్వాత అనుష్క రేంజ్ కూడా మారిపోయింది. అయితే ఆ తర్వాతే సినిమాల వేగం తగ్గించింది. సైజ్ జీరో చిత్రం కోసం లావు అయిన అనుష్క కొద్దిగా లావు తగ్గింది కానీ తాజాగా పోస్టర్ చూస్తుంటే ఇంకా పూర్తి స్థాయిలో లావు తగ్గలేదు అనే తెలుస్తోంది. ఇక అనుష్క పేరు చివరన శెట్టి అనే ఉంటుంది అలాగే నవీన్ కు కూడా పొలిశెట్టి అని ఉంటుంది కట్ చేస్తే ఆ చివరి పేర్లను మిస్ శెట్టి – మిస్టర్ పొలిశెట్టి అని కలిపి టైటిల్ గా ప్రకటించారు. దాంతో ఈ సినిమాపై కాస్త ఆసక్తి నెలకొంది. ఈ సినిమాను సౌత్ లోని నాలుగు భాషల్లో విడుదల చేయనున్నారు.