సాలిడ్ అందాల భామ అనుష్క శెట్టి ఇంకా లావు తగ్గలేదా ? అంటే అవుననే అంటున్నారు గుసగుసరాయుళ్లు. ఇక ఈ ఊహాగానాలకు మరింత ఊతమిచ్చేలా తాజాగా అనుష్క ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ ఫోటోలలో అనుష్క చాలా లావుగా ఉంది. దాంతో అనుష్క ఇంత లావుగా ఉందేంటి అని షాక్ అవుతున్నారు.
సైజ్ జీరో చిత్రం కోసం అనుష్క లావయ్యింది. ఆ సినిమాలో కథ , క్యారెక్టర్ ప్రకారం లావయ్యింది. అంత కస్టపడి లావు అయినప్పటికీ ,ఆ సినిమా ఘోర పరాజయం పాలయ్యింది. అయితే అప్పటి నుండి అనుష్క లావు తగ్గడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా లావు మాత్రం తగ్గడం లేదు. దాంతో సినిమాలు అంగీకరించడం లేదు. హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన అనుష్క గత మూడేళ్ళుగా సినిమాలు చేయడం లేదు.
ఇటీవల ఓ సినిమా అంగీకరించింది …… షూటింగ్ జరుగుతోంది అని ఊహాగానాలు వినిపించడం తప్ప అది షూటింగ్ జరుగుతోందా ? లేదా ? అన్నది పూర్తి వివరాలు అయితే తెలియడం లేదు. ఈలోగా తమిళ దర్శకుడు ఏ ఎల్ విజయ్ అనుష్కకు ఓ కథ చెప్పి ఒప్పించాడట. ఇక అనుష్క కూడా ఆ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అనుష్క లావుగా ఉన్నప్పటికీ కాస్త లావు తగినట్లుగానే చూపిస్తానని , అందుకోసం ఎంత ఖర్చు అయినా గ్రాఫిక్స్ కోసం పెడతామని హామీ ఇచ్చాడట. దాంతో ఒప్పుకున్నట్లు సమాచారం.