సాలిడ్ అందాల భామ అనుష్క వింత వ్యాధితో బాధపడుతోంది. ఈ విషయాన్ని ఎవరో చెప్పడం కాదు……. స్వయంగా అనుష్క చెప్పడం విశేషం. తాజాగా ఓ తమిళ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది ఈ సాలిడ్ అందాల భామ. ఆ ఇంటర్వ్యూలో తన వింత జబ్బు గురించి వివరించింది. ఇంతకీ అనుష్క కు ఉన్న వింత జబ్బు ఏంటో తెలుసా…….. పదేపదే నవ్వడం.
అవును ఒక్కసారి నవ్వడం స్టార్ట్ చేస్తే చాలు ఏకధాటిగా 15 నిమిషాల నుండి 20 నిమిషాల వరకు పడి పడి నవ్వుతూనే ఉంటుందట. దాంతో షూటింగ్ సమయంలో అయితే ఒక అరగంట పాటు బ్రేక్ ఇచ్చేవాళ్లట చిత్ర యూనిట్. ఇక అనుష్క నవ్వడం స్టార్ట్ చేస్తే చాలు యూనిట్ సభ్యుల్లో కొంతమంది ఏదైనా తినేసి రావడమో…… లేదంటే సిగరెట్ తాగే అలవాటు ఉన్నవాళ్లు హాయిగా ఓ గట్టి దమ్ము లాగేసి వచ్చేవాళ్లట. ఈ నవ్వును ఆపుకోవడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా లాభం లేకపోయిందట. అలాగే డాక్టర్ల దగ్గరకు కూడా పోయిందట. కానీ లాభం లేకపోయింది అని అంటోంది అనుష్క.
హీరోయిన్ ప్రధానాంశంగా తెరకెక్కుతున్న చిత్రాల్లో అనుష్క నటిస్తోంది. అయితే గతకొంత కాలంగా ఈ భామ పెద్దగా సినిమాలు చేయడం లేదు. తాజాగా నవీన్ పొలిశెట్టి అనే యంగ్ హీరోతో ఒక సినిమా చేస్తోంది. ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ నత్త నడకలా సాగుతోంది. మరో సినిమా ఏది కూడా లైన్లో లేదు. ప్రభాస్ తో పీకల్లోతు ప్రేమలో ఉందని పుకార్లు షికార్లు చేయడం తప్ప వాళ్ళు మాత్రం మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ మాత్రమే అని అంటున్నారు.