లావుగా ఉన్నావు కదా ! హీరోయిన్ తల్లిగా హీరోలకు తల్లి పాత్రల్లో నటించవచ్చు కదా ! అని మొహమాటం లేకుండా అడుగుతున్నారట పలువురు. ఇలా అడిగే వాళ్లలో దర్శక నిర్మాతలు మాత్రమే కాదు నెటిజన్లు కూడా ఉన్నారట. ఈ మాటలు విని విని విసిగిపోయింది. దాంతో ఈ మాటలు ఎక్కువ అవుతుండటంతో ఆగ్రహంతో దిమ్మతిరిగేలా సమాధానం ఇస్తోంది అపర్ణ బాలమురళి.
సూర్య హీరోగా నటించిన ” సురైపోట్రు ” అనే చిత్రంలో హీరోయిన్ గా నటించింది అపర్ణ బాలమురళి. మలయాళ ముద్దుగుమ్మ అయిన ఈ భామ మలయాళంలో పలు చిత్రాల్లో నటిస్తోంది. తమిళ్ లో కూడా పలు చిత్రాల్లో నటిస్తోంది. ఆకాశమే హద్దుగా అనే టైటిల్ తో తెలుగులో కూడా డబ్ అయ్యింది. ఈ చిత్రంలోని నటనకు అపర్ణకు జాతీయ అవార్డ్ వచ్చింది.
అయితే ఈ భామ లావుగా ఉండటంతో ఏజ్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. దాంతో హీరోయిన్ గా కంటే తల్లి పాత్రల్లో నటిస్తే బాగుంటుంది అని ఉచిత సలహా ఇస్తున్నారట. దాంతో దర్శక నిర్మాతలకు అలాగే నెటిజన్లకు చురకలు అంటించింది.