
రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన నోటా చిత్రంలో నటించిన భామ యాషికా ఆనంద్ కాగా ఈ భామపై అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. యాషికా ఆనంద్ పై అరెస్ట్ వారెంట్ జారీ కావడం ఏంటి ? అని షాక్ అవుతున్నారా ? 2021 లో కార్ యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్ లో యాషికా ఆనంద్ స్నేహితురాలు సింగర్ భవానీ వలిశెట్టి అక్కడికక్కడే చనిపోయింది.
కాగా ఆ యాక్సిడెంట్ లో యాషికా ఆనంద్ రెండు కాళ్లకు కూడా గాయాలయ్యాయి. కాలు ఫ్రాక్చర్ కావడంతో కొన్నాళ్ళు ఇంటి పట్టునే ఉండాల్సి వచ్చింది ఈ భామకు. అయితే ఈభామ ఫుల్లుగా మద్యం తాగి కారు డ్రైవ్ చేసింది. ఆ సమయంలోనే కారు యాక్సిడెంట్ జరిగింది. తన ఫ్రెండ్ చనిపోయింది. దాంతో పోలీసులు యాషికా ఆనంద్ పై 304 ఏ కింద కేసు నమోదు చేసారు చెన్నై పోలీసులు.
ఆ కేసు విచారణలో భాగంగా ఈనెల 21 న కోర్టుకు హాజరు కావాల్సి ఉంది కానీ యాషికా ఆనంద్ ఈనెల 21 న కోర్టుకు హాజరు కాలేదు. దాంతో ఆమెపై కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఏప్రిల్ 25 న యాషికా ఆనంద్ కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ యాషికా హాజరు కాకపోతే ఆమెను అరెస్ట్ చేయాలని ఆదేశించింది కోర్టు. దాంతో లాయర్లతో మంతనాలు జరుపుతోంది యాషికా ఆనంద్.






