హాట్ భామ అషు రెడ్డి కాళ్ళు పట్టుకున్న ఫోటో ఒకటి ట్వీట్ చేసాడు వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ. అషు రెడ్డి కుర్చీలో కూర్చొని ఉంటే ఆమె కాళ్ళు పట్టుకొని ఆమెనే సెక్సీ గా చూస్తున్నాడు వర్మ. ఇక అషు రెడ్డి తొడలు స్పష్టంగా కనిపిస్తుండటం ఈ ఫోటో విశేషం. దాంతో నెటిజన్లు వర్మ ను బూతులు తిడుతున్నారు.
అయితే కొంతమంది మాత్రం వర్మ లైఫ్ స్టైల్ కు ఫిదా అవుతున్నారు. జన్మ అంటే నీదే ……. మందు , విందు , పొందు నీ జన్మ ధన్యమైందని వర్మను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇక పనిలో పనిగా అషు రెడ్డి పై కూడా బూతుల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఎవరు ఎంతగా తిడుతున్నా వాళ్ళు మాత్రం పట్టించుకునేలా కనిపించడం లేదు.
తాజాగా వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన డేంజరస్ అనే సినిమా విడుదల అవుతున్న సందర్బంగా ఇలా పబ్లిసిటీ చేసుకుంటున్నాడు వర్మ. పబ్లిసిటీ విషయంలో వర్మ ను మించిన వాడు లేడంటే నమ్మండి. మొత్తానికి అషు రెడ్డి – వర్మ మరోసారి హాట్ టాపిక్ అయ్యారు ఈ ఫోటోతో.