Kritisanan కృతి సనన్.. ఈ బ్యూటీ గురించి అందరికి తెలుసు.. ఈమె పాన్ ఇండియన్ వ్యాప్తంగా ఫేమస్ అయ్యింది.. బాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు కృతి సనన్ పేరు ఈ మధ్య బాగా వినిపించింది. అందుకు కారణం ఆదిపురుష్.. ప్రభాస్ హీరోగా కృతి సనన్ హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ మూవీ ఇటీవలే రిలీజ్ అయ్యింది.
కానీ ఈ సినిమా దూరంగా ఫెయిల్ అయ్యింది. ఈ సినిమాతో పాన్ ఇండియన్ వ్యాప్తంగా ఈమె అవకాశాలు అందుకోవాలని అనుకుంది.. కానీ ఈ సినిమా దారుణంగా నిరాశ పరచడంతో మళ్ళీ బాలీవడ్ లోనే సెటిల్ అయ్యింది. గతంలో మహేష్ బాబుతో చేసిన వన్ నేనొక్కిడినే కూడా ఇలాగె ప్లాప్ అవ్వడంతో ఇన్నేళ్లు టాలీవుడ్ లో కనిపించలేదు.
ఇక ఇప్పుడు ఎన్నో ఆశలతో చేసిన ఆదిపురుష్ సినిమా విషయంలో కూడా ఇదే జరిగింది. సౌత్ లో పాగా వేసి స్టార్ హీరోలందరితో నటించాలి అనుకున్నప్పుడల్లా ఈమెకు చేదు అనుభవమే ఎదురవుతుంది. ఇది పక్కన పెడితే ఈమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని బాడీ షేమింగ్ గురించి ఆమెకు ఎదురైన కామెంట్స్ గురించి తెలిపింది.. ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఈమె మాట్లాడుతూ నీ ముక్కు బాలేదు.. బాగా ఎర్రగా ఉంది అంటూ కొందరు నాకు చెత్త సలహాలు ఇచ్చారని బాలీవుడ్ లో ఛాన్సుల కోసం ట్రై చేస్తున్నప్పుడు ఈ చేదు అనుభవాలు ఎదురయ్యాయి అంటూ తెలిపింది. అంతే కాదు నీ పెదాలు కూడా బాలేదు.. వాటికీ సర్జరీ చేయించుకుంటే హీరోయిన్ గా ఛాన్సులు వస్తాయని అన్నారు. చాలా బాధగా అనిపించింది. కానీ నేను ఎలాంటి సర్జరీలు చేయించుకోలేదు నా టాలెంట్ అండ్ డెడికేషన్ నే ఇక్కడి వరకు తీసుకు వచ్చింది అని తెలిపింది.