
స్టార్ హీరోయిన్ సమంత ఆరోగ్యం పై సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి. సమంత మాయో సైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. అయితే ఆ వ్యాధి వల్ల సమంత కు ఇప్పటికిప్పుడు వచ్చే ప్రమాదం ఏమి లేదని , కాకపోతే 2025 తర్వాత మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. 2025 వరకు కూడా కెరీర్ బాగుంటుందని , 2025 నుండి మాత్రం ఆరోగ్య పరంగా సమస్యలు ఎక్కువ అవుతాయని బాంబ్ పేల్చాడు.
సమంత మాయో సైటిస్ తో బాధపడుతున్న సంగతి తెలిసిందే. దాంతో కొంత కాలంగా సినిమాలు చేయడం లేదు. ప్రస్తుతం హైదరాబాద్ లోని ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటోంది. అలాగే చికిత్స పొందుతోంది. బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాలను అంగీకరించింది. అయితే అనారోగ్యం కారణంగా ప్రస్తుతం సినిమాలు చేయలేని పరిస్థితి. దాంతో కొన్నాళ్ల పాటు షూటింగ్ వాయిదా వేయాలని దర్శక నిర్మాతలను కోరుతోంది. అయితే భారీ బడ్జెట్ , అలాగే భారీ తారాగణం కావడంతో వాయిదా వేస్తారా అన్నది చూడాలి. సమంత అనారోగ్యానికి గురి కావడంతో ఆమె త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు…… దేవుళ్ళకు పూజలు చేస్తున్నారు.