
నందమూరి తారకరత్న మరణాన్ని ప్రముఖ జ్యోతిష్యులు వేణు స్వామి ముందే ఊహించారా ? అంటే అవుననే అనిపిస్తోంది. ఎందుకంటే కొన్ని నెలల కిందటే ఒక హీరో చనిపోబోతున్నాడని అలాగే ఒక హీరోయిన్ కూడా చనిపోవడం ఖాయమని తెలిపాడు. అప్పుడు పెద్దగా పట్టించుకోలేదు కానీ అకస్మాత్తుగా నందమూరి తారకరత్న చనిపోవడంతో ఈ స్వామి చెప్పిన విషయాలు ఒక్కసారిగా మళ్ళీ చర్చకు వచ్చాయి.
గతంలో కూడా వేణు స్వామి చెప్పిన పలు విషయాలు నిజమయ్యాయి. అలాగే కొన్ని తేలిపోయాయి. అయితే కొన్ని విషయాలు నిజం అయ్యాయి దాంతో వేణు స్వామి చెప్పిన విషయాలు వైరల్ అవుతున్నాయి. కొన్నాళ్ల క్రితం ఓ హీరో చనిపోతాడని చెప్పిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పట్టుమని 40 ఏళ్ళు కూడా లేని తారకరత్న అర్దాంతరంగా తనువు చాలించడంతో నందమూరి కుటుంబం తీవ్ర దుఃఖసాగరంలో మునిగింది. ఇక తారకరత్న పిల్లల గురించి పెద్ద చర్చ జరుగుతోంది. తారకరత్నకు ముగ్గురు పిల్లలు కావడంతో వాళ్ళను ఆర్ధికంగా ఆదుకోవడానికి బాలయ్యతో పాటుగా మిగతా వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు కానీ తండ్రి లేని లోటును మాత్రం ఎవరూ పూడ్చలేనిది.
తారకరత్న అర్దాంతరంగా మరణించడంతో ఇక ఇప్పుడు త్వరలో చనిపోయే హీరోయిన్ ఎవరు ? అనే భయం నెలకొంది. హీరో మాత్రమే కాదు ఒక హీరోయిన్ కూడా చనిపోయాడం ఖాయమని చెప్పాడు ఆ స్వామి. దాంతో ఆ హీరోయిన్ ఎవరు ? అనే చర్చ మొదలైంది. ఈ స్వామి చెప్పే విషయాలు సెలబ్రిటీల గుండెల్లో రైళ్లు పరుగెత్తేలా చేస్తున్నాయి.