
రామోజీ ఫిలిం సిటీ మాజీ ఎండీ అట్లూరి రామ్మోహన్ రావు అక్టోబర్ 22 న హైదరాబాద్ లో మరణించారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రామ్మోహన్ రావు హైదరాబాద్ లోని ఏ ఐ జీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అట్లూరి రామ్మోహన్ రావు మృతి వార్త రామోజీరావును తీవ్రంగా కలిచి వేసింది.
రామ్మోహన్ రావు – రామోజీరావు ఇద్దరు కూడా బాల్య స్నేహతులు. దాంతో తన రామోజీ ఫిలిం సిటీ బాధ్యతలను రామ్మోహన్ కు అప్పగించారు రామోజీరావు. కృష్ణా జిల్లా పెదపారుపూడిలో 1935 లో జన్మించారు రామ్మోహన్ రావు. ఉపాధ్యాయుడిగా కెరీర్ ప్రారంభించిన రామ్మోహన్ రామోజీ అండదండలతో ఈనాడు గ్రూప్ లో చేరారు.
ఆ తర్వాత రామోజీ ఫిలిం సిటీ ఎండీగా కొనసాగారు. రామోజీ కి చేదోడు వాదోడుగా ఉన్నారు. రామ్మోహన్ రావు అంత్యక్రియలు ఈరోజు హైద్రాబాద్ లోని మహాప్రస్థానం లో జరుగనున్నాయి.