ఆగస్టు నెలలో విడుదలైన చిత్రాల్లో ఏకంగా 3 చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి దాంతో యావత్ టాలీవుడ్ ఫుల్ జోష్ లో ఉంది. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన బింబిసార , దుల్కర్ సల్మాన్ నటించిన సీతారామం , నిఖిల్ హీరోగా నటించిన కార్తికేయ 2 ఈ మూడు చిత్రాలు కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. విశేషం ఏంటంటే ……. బింబిసార , సీతారామం , కార్తికేయ 2 ఈ మూడు చిత్రాలను నిర్మించిన నిర్మాతలకు అలాగే కొన్న బయ్యర్లకు కూడా భారీగా లాభాలు వచ్చాయి.
దాంతో టాలీవుడ్ చాలా సంతోషంగా ఉంది. ఆగస్టు బాగానే ఉండటంతో సెప్టెంబర్ లో తప్పకుండా ఓ హిట్ లభిస్తుందేమో అనుకున్నారు. కానీ ఈ నెలలో అప్పుడే సగానికి పైగా రోజులు అయిపోయాయి. కానీ విడుదలైన సినిమాలు ఏవి కూడా కనీస ఓపెనింగ్స్ కూడా తీసుకు రాలేకపోయాయి. ఇక మరో రెండు వారాల్లో కృష్ణ బృందా విహారి , గుర్తుందా శీతాకాలం , అల్లూరి , పొన్నియన్ సెల్వన్ -1 చిత్రాలు విడుదల అవుతున్నాయి.
సెప్టెంబర్ నెల సగంలో విడుదలైన చిత్రాలు ప్లాప్ అయ్యాయి. ఇక మిగిలిన సగం నెలలో రిలీజ్ అవుతున్న చిత్రాల్లో అంచనాలున్న చిత్రం పొన్నియన్ సెల్వన్ -1 మాత్రమే ! మరి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి. అలాగే కృష్ణ బృందా విహారి చిత్రం పై కూడా కాస్త అంచనాలున్నాయి. మరి వీటిలో ఏవి సత్తా చాటుతాయో చూడాలి. ఆగస్టు అదిరింది …… సెప్టెంబర్ ఇప్పటి వరకు దొబ్బింది.