హాట్ యాంకర్ అనసూయ లేనిపోని తలనొప్పి తెచ్చుకుంటోంది. తరచుగా ఏవో కొన్ని విషయాలపై తన అభిప్రాయాన్ని చెప్పడం , దాంతో నెటిజన్ల నుండి విమర్శలు రావడంతో కొన్నిసార్లు వైల్డ్ గా రియాక్ట్ అవుతోంది. దాంతో సమస్యలు వస్తున్నాయి. తాజాగా అనసూయ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. ఆమె నేరుగా విజయ్ దేవరకొండ పేరు కానీ , లైగర్ చిత్రం గురించి కానీ కామెంట్ చేయలేదు కానీ ఆ సినిమా విడుదల రోజున చేసిన ట్వీట్ లైగర్ సినిమా గురించే అని భావించిన రౌడీ ఫ్యాన్స్ అనసూయ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.
ఇక కొందరు అనసూయని ఆంటీ అని సంబోదించడంతో బాగా ఫీల్ అయ్యింది. ఇంకేముంది నన్ను ఆంటీ అని పిలిస్తే ……. కేసు పెట్టి జైలుకు పంపిస్తా అని ఆవేశపడుతోంది. అనసూయ ఆగ్రహంతో ఊగిపోతుండటంతో నెటిజన్లు కూడా కొందరు అదేపనిగా టార్గెట్ చేస్తున్నారు. ఇది ఎంతగా అంటే పర్సనల్ గా కూడా వెళుతోంది.
అనసూయ కు యూత్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అద్భుతమైన క్రేజ్ ఉంది. అయితే ఎంతమంది అభిమానిస్తారో అందులో కొందరు వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళ తోనే పాపం ఇబ్బందులు తెచ్చుకుంటోంది అనసూయ. తనని ఆంటీ అని సంబోధిస్తుండటంతో నెటిజన్ల పై బుసలు కొడుతోంది.
Breaking News