Trigun హీరోగా రుబాల్ షేక్ రావత్ హీరోయిన్ గా అయాన్ బొమ్మాలి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ” అవసరానికో అబద్ధం ” . గ్లోబల్ ఎంపర్ బ్రాడ్ కాస్టింగ్ ప్రయివేటు లిమిటెడ్ పతాకంపై ఈ చిత్రాన్ని పాన్ ఇండియా చిత్రంగా నిర్మిస్తున్నారు డాక్టర్ జగదీష్ బాబు యలమంచిలి. ఎన్నారై అయిన డాక్టర్ జగదీష్ బాబు యలమంచిలి మొదటిసారిగా చలనచిత్ర నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతున్నారు. విభిన్న కథా చిత్రాలను నిర్మించాలని భావించిన డాక్టర్ జగదీష్ బాబు యలమంచిలి ” అవసరానికో అబద్ధం “అనే చిత్రంతో మొదటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక మొదటి ప్రయత్నంలోనే పాన్ ఇండియా చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం ఈరోజు హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ చిత్రానికి క్లాప్ ఇచ్చారు. యువ రాజకీయ నాయకులు దేవినేని అవినాష్ , పాతురి నాగభూషణం , అగ్ర నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు , చిత్ర సమర్పకులు యలమంచిలి కృష్ణమూర్తి , యలమంచిలి రమేష్ బాబు , చిత్ర నిర్మాత డాక్టర్ జగదీష్ బాబు యలమంచిలి, చిత్ర దర్శకుడు అయాన్ బొమ్మాలి , సహ నిర్మాత వెంకటేష్ లతో పాటుగా పలువురు పాల్గొన్నారు.