
అవతార్ 2 ప్రపంచ వ్యాప్తంగా వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కేంద్రాల్లో డిసెంబర్ 16 న అవతార్ 2 చిత్రం విడుదలైన విషయం తెలిసిందే. అడ్వాన్స్ బుకింగ్ లతో సంచలనం సృష్టించిన ఈ చిత్రం భారతదేశంలో కేవలం 2 రోజుల్లోనే 102 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి చరిత్ర సృష్టించింది.
తెలుగు , తమిళ , హిందీ , మలయాళ భాషలతో పాటుగా భారీ ఎత్తున విడుదల అయ్యింది అవతార్ 2 . అన్ని భాషల్లో కలిపి కేవలం 2 రోజుల్లోనే 102 కోట్లు వసూల్ చేయడం అంటే మాటలు కాదు. 2 రోజుల్లోనే 100 కోట్లకు పైగా కలెక్షన్స్ రావడంతో ముందు ముందు వచ్చే వసూళ్లు ఏ స్థాయిలో ఉంటాయో అనే అయోమయం నెలకొంది.
అవతార్ 2 కలెక్షన్స్ చూసి షాక్ అవుతున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఓవరాల్ గా అవతార్ 2 చిత్రం భారతదేశంలో ప్రభంజనం సృష్టించడం ఖాయమని భావిస్తున్నారు. మొత్తానికి అవతార్ 2 భారత్ లోనే 400 కోట్లకు పైగా వసూళ్లు సాధించడం ఖాయమని లెక్కలు వేస్తున్నారు ట్రేడ్ పండితులు. అవతార్ 2 చిత్రాన్ని చూడాలని ఉవ్విళ్లూరుతున్నారు ప్రేక్షకులు.