23.8 C
India
Wednesday, March 22, 2023
More

    బాహుబలిని బొందపెట్టిన పఠాన్

    Date:

    baahubali Vs pathaan collections
    baahubali Vs pathaan collections

    బాహుబలిని బొందపెట్టిన పఠాన్ అంటూ షారుఖ్ ఖాన్ అభిమానులు సెటైర్లు వేస్తున్నారు సోషల్ మీడియాలో. అంతేకాదు 2017 లో బాహుబలి 2 సృష్టించిన రికార్డులను పఠాన్ తో బద్దలు కొట్టాడని దాంతో కొత్త రికార్డులు షారుఖ్ వశమయ్యాయంటూ పండగ చేసుకుంటున్నారు. గత అయిదేళ్లుగా షారుఖ్ ఖాన్ కు హిట్ లేదు దాంతో కొన్నాళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్నాడు.

    పఠాన్ సినిమాతో షారుఖ్ రీ ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఈ సినిమా విడుదలకు ముందు ‘బాయ్ కాట్ అంటూ ట్రెండింగ్ అయ్యేలా చేసారు కొంతమంది నెటిజన్లు. ఇటీవల కాలంలో బాలీవుడ్ లో పలు చిత్రాలను బాయ్ కాట్ చేయాలంటూ ట్విట్టర్ లో ఎంతగా మొత్తుకున్నారో అదేవిధంగా జరిగింది. ఆ సినిమాలన్నీ ఘోర పరాజయం పొందాయి. దాంతో షారుఖ్ సినిమాకు కూడా అదేగతి పడుతుందా? అని అనుకున్నారు.

    దానికి తోడు దీపికా పదుకోన్ బికినీ సాంగ్ కూడా పలు వివాదాలను సృష్టించింది. కట్ చేస్తే పఠాన్ అలా విడుదల అవ్వడమే ఆలస్యం ఇలా రికార్డులను కట్టబెట్టడం మొదలు పెట్టారు ప్రేక్షకులు. చాలాకాలం నుండి షారుఖ్ ఖాన్ సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు కావాల్సన మసాలా పఠాన్ ద్వారా లభించడంతో వసూళ్ల వర్షం కురిపించారు. పఠాన్ ప్రపంచ వ్యాప్తంగా 1030 కోట్లను  సాధించింది. 1100 కోట్ల దిశగా దూసుకుపోతోంది. అయితే బాహుబలి 2 రికార్డ్ ఎలా బద్దలయ్యింది అనే కదా మీ అనుమానం ? ఎందుకంటే బాహుబలి 2 ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 2000 కోట్లకు పైగా  వసూళ్లను సాధించింది. అయితే ఇండియాలో మాత్రం అందునా హిందీ వెర్షన్ 511 కోట్ల వసూళ్లను సాధించింది. అయితే షారుఖ్ ఖాన్ పఠాన్ 528 కోట్ల వసూళ్లను సాధించి బాహుబలి 2 రికార్డ్ ను బద్దలు కొట్టింది.

    దాంతో బాహుబలి రికార్డ్ ను  షారుఖ్ పఠాన్ తో బొందపెట్టాడు అంటూ సమాధిని కూడా డిజైన్ చేసారు సోషల్ మీడియాలో. ఆ సమాధి వద్ద షారుఖ్ ఉన్నట్లుగా చిత్రీకరించారు నెటిజన్లు. ఇక బాహుబలి 2 రికార్డ్ పఠాన్ బద్దలు కొట్టడంతో మాకు ఎలాంటి భేషజం లేదని , ఇలాంటి రికార్డులను స్వాగతిస్తున్నామని , భారతీయ సినిమా ఎదుగుతున్నందుకు గర్వంగా ఉందని ట్వీట్ చేసాడు బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ.

    Share post:

    More like this
    Related

    ముగిసిన ఎమ్మెల్సీ కవిత విచారణ

    ఎమ్మెల్సీ కవిత విచారణ ముగిసింది. ఈరోజు 10 గంటల పాటు కవితను...

    తీన్మార్ మల్లన్నను అరెస్ట్ చేసిన పోలీసులు

    Q న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్ ను రన్ చేస్తూ తెలంగాణ...

    మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ : భోళా శంకర్ రిలీజ్ డేట్ వచ్చేసింది

    ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని మెగా ఫ్యాన్స్ కు శుభవార్త చెప్పారు భోళా...

    రంగమార్తాండ రివ్యూ

    నటీనటులు : ప్రకాష్ రాజ్ , రమ్యకృష్ణ , బ్రహ్మానందం సంగీతం :...

    POLLS

    ఈడీ విచారణలో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అవుతుందా ?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    ప్రభాస్ తో రొమాన్స్ :10 కోట్లు డిమాండ్ చేసిన దీపికా పదుకోన్

    డార్లింగ్ ప్రభాస్ తో రొమాన్స్ చేయడానికి దీపికా పదుకోన్ 10 కోట్లు...

    ప్రభాస్ ప్రాజెక్ట్ – కె లో దుల్కర్ సల్మాన్ కూడా ?

    యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా నటిస్తున్న చిత్రం '' ప్రాజెక్ట్...

    డార్లింగ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ : ప్రాజెక్ట్ – కె రిలీజ్ డేట్ ప్రకటించారు

    డార్లింగ్ ప్రభాస్ అభిమానులకు శుభవార్త........ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రాజెక్ట్ -...

    1000 కోట్ల క్లబ్ లో చేరిన షారుఖ్ పఠాన్

    కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ 1000 కోట్ల క్లబ్...