
టాలీవుడ్ లో వరుస మరణాలు సంభవించడంతో తీవ్రంగా చలించారు సీనియర్ నటుడు బాబూ మోహన్. కరోనా కష్టకాలం నుండి టాలీవుడ్ లో పలువురు నటీనటులు మరణించారని , ఇక ఇప్పుడేమో కృష్ణంరాజు, కృష్ణ , కైకాల సత్యనారాయణ, చలపతిరావు లు మరణించారని వరుస మరణాలు నన్ను తీవ్రంగా కలిచి వేసాయని విచారం వెలిబుచ్చారు.
ప్రేక్షకులను నవ్వించడం , ఎంటర్ టైన్ చేయడానికే మేమున్నాం. ప్రేక్షకులను అలరిస్తున్న మా పట్ల ఆ దేవుడు దయ చూపాలని , నవ్విస్తున్న మమ్మల్ని ఏడ్చేలా చేయొద్దని వేడుకున్నారు. ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చినా సినిమా రంగం మేమున్నాం అంటూ సహాయ సహకారాలు అందించిందని , అన్న నందమూరి తారకరామారావు, అక్కినేని, కృష్ణ , శోభన్ బాబు , కృష్ణంరాజు తదితరులంతా వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టారని …… అలాంటి మా సినిమా కుటుంబంలో వరుస మరణాలు చోటు చేసుకున్నాయని , వాళ్ళతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు బాబూ మోహన్. JSW & Jaiswaraajya.tv సంస్థల కమ్యూనికేషన్ మేనేజర్ చిలువేరు శంకర్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ లో వరుస మరణాల పట్ల ఆవేదన వ్యక్తం చేశారు బాబూ మోహన్.