జబర్దస్త్ హాస్య నటుడు వేణు దర్శకుడిగా మారి రూపొందించిన చిత్రం బలగం. అగ్ర నిర్మాత దిల్ రాజు వారసులు నిర్మించిన ఈ చిత్రం మార్చి 3 న విడుదలైన విషయం తెలిసిందే. విడుదలకు ముందే ఈ సినిమాను పలు చోట్ల ప్రదర్శించారు. దాంతో ఈ సినిమా టాక్ బాగా స్ప్రెడ్ అయ్యింది. మౌత్ టాక్ తో కలెక్షన్స్ పెరిగి వారం రోజుల్లోనే లాభాల్లోకి వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా వారం రోజుల్లో 7 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను 3 కోట్లకు పైగా షేర్ ను కలెక్ట్ చేసింది. చిన్న చిత్రంగా వచ్చిన.బలగం పెద్ద విజయాన్ని అందుకుంది.
ప్రియదర్శి హీరోగా నటించిన ఈ చిత్రంలో కావ్య కళ్యాణ్ రామ్ హీరోయిన్ గా నటించింది. సుధాకర్ రెడ్డి , వేణు తదితరులు నటించిన బలగం మూడున్నర కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది. థియేట్రికల్ గానే ఈ సినిమా సేఫ్ జోన్ లోకి వచ్చింది. ఇవి కాక శాటిలైట్, OTT రైట్స్ , డిజిటల్ , డబ్బింగ్ రైట్స్ రూపంలో భారీ ఎత్తున లాభాలను తెచ్చి పెడుతోంది. బలగం బ్లాక్ బస్టర్ కావడంతో దిల్ రాజు దర్శకుడు వేణు కు మరో అవకాశం ఇచ్చాడు. దిల్ రాజు బ్యానర్ లోనే తన రెండో సినిమా చేయనున్నాడు వేణు. మానవ సంబంధాలను చక్కగా ఆవిష్కరించిన సినిమాగా బలగం చిత్రానికి ప్రశంసల వర్షం కురుస్తోంది.