అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మించిన చిత్రం బలగం. కమెడియన్ వేణు ఈ బలగం చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ప్రియదర్శి , కావ్య కళ్యాణ్ రామ్ జంటగా నటించిన ఈ చిత్రం ఈనెల 3 న విడుదల అవుతోంది. దాంతో కొన్ని చోట్ల ఈ సినిమాని ముందుగానే ప్రదర్శించారు. ఈ చిత్రాన్ని తిలకించిన ప్రేక్షకుల నుండి పాజిటివ్ స్పందన లభించింది. దాంతో చిత్ర బృందం చాలా సంతోషంగా ఉంది.
గతంలో కూడా పలు చిత్రాలు ఇలా విడుదలకు ముందే తమ సినిమాలను కొన్ని ప్రదేశాల్లో ప్రేక్షకులకు ప్రదర్శించారు. మంచి స్పందన వచ్చి మౌత్ టాక్ స్ప్రెడ్ అయి సూపర్ హిట్ అయిన దాఖలాలు ఉన్నాయి. వాటిలాగే బలగం కూడా సూపర్ హిట్ అవుతుందని ధీమాగా ఉన్నారు బలగం చిత్ర యూనిట్.