34.7 C
India
Friday, April 10, 2026
More

    ప్రపంచ దేశాల్లో దూసుకెళ్తున్న బలగం.. మరో అవార్డు

    Date:

    Balagam wins another international award
    Balagam wins another international award

    తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో కుటుంబ అనుబంధాల ఇతివృత్తంలో రూపుదిద్దుకున్న సినిమా బలగం. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ థియేటర్లలోనే కాదు మారుమూల పల్లెల్లోనూ ఈ సినిమా సత్తా చాటుతోంది. కలెక్షన్లు, ప్రశంసలతో పాటు అవార్డులు సాధిస్తోంది. జబర్దస్త్ నటుడు వేణు యెల్దండి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికే ప్రతిష్టాత్మక లాస్ ఏంజిల్స్ అవార్డు లను రెండింటిని సొంతం చేసుకోగా.. తాజాగా మరో అంతర్జాతీయ అవార్డును దక్కించుకుంది.

    ప్రియదర్శి పులికొండ , కావ్య హీరోహీరోయిన్లుగా దిల్ రాజు వారసులు హర్షిత్, హన్షిత నిర్మాణంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాకు వరుస అవార్డులు లభిస్తున్నాయి. తాజాగా ఉక్రెయిన్ లో జరిగిన ఓనికో ఫిల్మ్ అవార్డుల్లో బలగం సినిమాకు ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో పురస్కారం దక్కింది. మార్చ్ 3వ తేదీన థియేటర్ లలో విడుదలైన ఈ సినిమా అప్పటి నుంచి తెలుగు రాష్ట్రాలలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలను ఆకర్షిస్తోంది. ఇటు ఓటీటీలోనూ ట్రెండింగ్ లో ఉంది. అలాంటి ఈ సినిమాకు గత నెలలో లాస్ ఏంజిల్స్ అవార్డుల్లో ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సినిమాటోగ్రఫీ విభాగంలో వేణు ఎల్డండి, ఆచార్య వేణుకు అవార్డులు లభించింది. ఈ అవార్డులు రావడంపై నిర్మాత దిల్ రాజు హర్షం వ్యక్తం చేశారు.

    కాగా అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటుగా సింప్లీ సౌత్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ లో మార్చి 24న విడుదలైన ఈ సినిమా ఇంటిల్లిపాదినీ అలరిస్తోంది. ఈ సినిమాను పలు గ్రామాల్లో రచ్చబండ వద్ద గ్రామస్తులంతా కలిసి వీక్షిస్తున్నారు. ఇప్పటికే దాదాపు 10 గ్రామాల్లో ఈ సినిమాను బహిరంగ ప్రదర్శన చేశారు. సినిమా చూస్తూ పల్లె ప్రజలు కన్నీళ్లు పెట్టిన వీడియోలు వైరల్ గా మారాయి. అయితే బహిరంగంగా వీక్షించడంపై దిల్ రాజు అసంతృప్తిలో ఉన్నాడు. థియేటర్, ఓటీటీలో చూడకుండా ఇలా బహిరంగంగా చూడడంతో తమకు ఆదాయం పోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Balagam Mogilayya : ఇండస్ట్రీలో విషాదం. ‘బలగం’ మొగిలయ్య కన్నుమూత..

    Balagam Mogilayya : ఈ మధ్యనే బలగం మోగిలయ్య మరియు అతని...

    Jagtial : మూలుగు బొక్క కోసం పెళ్లి రద్దు.. జగిత్యాల జిల్లాలో ‘బలగం’ మూవీ రిపీట్

    Jagtial : చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్ గా నిలిచిన...

    balagam : బలగం లాగే సెన్సేషన్..? ఈ సినిమాను చూశారా?

    balagam : మొదట్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాచేసిన తిరువీర్ మసూదతో హీరోగా...