
నటసింహం నందమూరి బాలకృష్ణ యంగ్ హీరోలతో పోటీ పడుతున్నాడు. అసలు నిజం చెప్పాలంటే యంగ్ హీరోలు ఏడాదికి , రెండేళ్లకు ఒక సినిమా చేస్తుంటే బాలయ్య ఏడాది లోపలే ఒక సినిమా చేస్తూ ఆ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమాను లైన్లో పెడుతూ యమా జోష్ తో ఉన్నాడు. వీరసింహా రెడ్డి ఇంకా విడుదల కాకముందే అనిల్ రావిపూడి సినిమా ప్రారంభించడానికి ఏర్పాట్లు చేసాడు బాలయ్య.
డిసెంబర్ 8 న అనిల్ రావిపూడి – బాలయ్య కాంబినేషన్ లో వచ్చే సినిమా ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 8 న ఓపెనింగ్ చేసి రెగ్యులర్ షూటింగ్ మాత్రం జనవరి నుండి చేయనున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో బాలయ్య సరసన ప్రియాంక జవాల్కర్ నటించనున్నట్లు తెలుస్తోంది. ఇక బాలయ్య కూతురుగా కొత్త హీరోయిన్ శ్రీ లీల నటించనుంది.
తండ్రీ – కూతురు సెంటిమెంట్ చిత్రంగా రూపొందుతోంది. బాలయ్యను ఇంతవరకు చూడని విధంగా చూపించడానికి ప్రయత్నాలు చేస్తున్నానని అంటున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి. సహజంగానే అనిల్ రావిపూడి చిత్రాలు ఎంటర్ టైన్ మెంట్ గా ఉంటాయి కానీ అందుకు విరుద్దంగా బాలయ్యతో ప్రయోగానికి సిద్దమయ్యాడట.