
నటసింహం నందమూరి బాలకృష్ణ తన గొప్ప మనసు మరోసారి చాటుకున్నాడు. కోపం వస్తే అరవడం …… కొట్టడం మాత్రమే కాదు ఆపదలో ఉన్నవాళ్లను ఆదుకోవడానికి ఏమాత్రం వెనకడుగు వేయని గొప్ప వ్యక్తి బాలయ్య. మాట కరుకు …… కానీ బాలయ్య మనసు వెన్న అనే విషయం పలుమార్లు తెలిసిన విషయమే.
తాజాగా ఓ సంఘటనతో మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నాడు బాలయ్య. అసలు విషయం ఏమిటంటే…… దర్శకుడు బోయపాటి శ్రీను దగ్గర దర్శకత్వ శాఖలో పని చేసే మహేష్ యాదవ్ అనే వ్యక్తి క్యాన్సర్ బారిన పడ్డాడు. ఆ రోగం నయం కావాలంటే 40 లక్షలు అవుతుందట. అంత డబ్బు లేక ఇబ్బంది పడుతూ బోయపాటి శ్రీను కు ఈ విషయం చెప్పగా …… బాలయ్య సహాయం కోరాడు బోయపాటి. ఇంకేముంది బోయపాటి అగడడం బాలయ్య చేయకపోవడమా ……. పైసా ఖర్చు లేకుండా మొత్తం 40 లక్షల ట్రీట్ మెంట్ ను పూర్తి ఉచితంగా చేయించాడట బాలయ్య.
బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి బాలయ్య చైర్మన్ అనే విషయం తెలిసిందే. దాంతో పెద్ద ఎత్తున పలువురు పేద ప్రజలకు తక్కువలో అలాగే కొంతమందికి ఉచితంగా కూడా చికిత్స అందిస్తున్నాడు బాలయ్య. తాజాగా మహేష్ యాదవ్ అనే అసిస్టెంట్ డైరెక్టర్ కు చికిత్స చేయించడంతో బాలయ్య గొప్ప మనసు గురించి సోషల్ మీడియాలో చాటుతున్నారు అభిమానులు. బాలయ్య పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ప్రస్తుతం బాలయ్య అనిల్ రావిపూడి దర్శకత్వంలో 108 వ చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో బాలయ్య కూతురుగా శ్రీలీల నటిస్తోంది. బాలయ్య కెరీర్ లో ఇది విభిన్న పాత్ర అని అంటున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి. ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ లో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు చిత్ర బృందం.