
నటసింహం నందమూరి బాలకృష్ణ వారసుడు నందమూరి మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇచ్చేది ఎప్పుడు ? అంటూ చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు నందమూరి అభిమానులు. అయితే మోక్షజ్ఞ మాత్రం హీరోగా ఎంట్రీ ఇప్పట్లో ఇచ్చేది లేదనే సంకేతాలు ఇస్తూనే ఉన్నాడు తన ఆకారంతో. మోక్షజ్ఞ ఆకారం చూస్తే ……… లావుగా ఉండటంతో హీరోగా నటిస్తాడా ? అనే అనుమానం కలుగుతోంది అభిమానులకు.
అయితే నందమూరి మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వడం ఖాయమట. అంతేకాదు స్టార్ హీరోగా కూడా ఎదుగుతాడాట. ఈ విషయాన్ని ఎవరో చెప్పడం కాదు ….. పలువురు సెలబ్రిటీల జాతకాలు చెబుతున్న వేణు స్వామి ఈ మాటలు అంటున్నాడు. మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇస్తాడు కాస్త ఆలస్యం అవుతుంది కానీ హీరోగా మాత్రం స్టార్ డం అందుకుంటాడు …… నందమూరి అభిమానులను అలరిస్తాడు అని అంటున్నాడు వేణు స్వామి.
సినిమాల్లో బాలయ్య వారసుడిగా సత్తా చాటినప్పటికీ రాజకీయాల్లో మాత్రం ఎంటర్ అవడట. మోక్షజ్ఞ కు రాజకీయ యోగం లేదని కుండబద్దలు కొట్టాడు వేణు స్వామి. మోక్షజ్ఞ ప్రస్తుతం లావుగా ఉన్నాడు. ఇంకాస్త తగ్గాలి అప్పుడే అభిమానులను అలరించడానికి అవకాశం ఉంటుంది. మరి లావు తగ్గేది ఎప్పుడు ? వెండితెర మీదకు దూసుకు వచ్చేది ఎప్పుడు అనేది చూడాలి.