నటసింహం నందమూరి బాలకృష్ణ సూపర్ స్టార్ కృష్ణ కు నివాళి అర్పించారు. నిన్న కర్నూల్ పరిసర ప్రాంతంలో వీరసింహారెడ్డి షూటింగ్ లో ఉన్నారు బాలయ్య. దాంతో షూటింగ్ జరిగే లొకేషన్ లోనే కృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం షూటింగ్ క్యాన్సిల్ చేసుకొని హైదరాబాద్ వచ్చారు.
హైదరాబాద్ కు చేరుకున్న బాలయ్య తన కుటుంబంతో సహా వచ్చి ఫిలిం నగర్ లోని పద్మాలయా స్టూడియోకు చేరుకున్నారు. కృష్ణకు నివాళి అర్పించడమే కాకుండా ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. మహేష్ బాబుకు ధైర్యం చెప్పారు. బాలయ్య వెంట భార్య వసుంధర , ఇద్దరు కూతుర్లు ఉన్నారు. బాలయ్య కృష్ణ తో కలిసి సుల్తాన్ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. కృష్ణ పార్దీవ దేహాన్ని దర్శించుకోవడానికి , నివాళులు అర్పించడానికి రెండు తెలుగు రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. దాంతో రహదారులన్నీ క్రిక్కిరిసిపోయాయి.