నటసింహం నందమూరి బాలకృష్ణ తారకరత్న ముగ్గురు పిల్లల బాధ్యతలను తీసుకుంటున్నట్లుగా కుటుంబ సభ్యులకు తెలిపారట. తారకరత్న – అలేఖ్య రెడ్డి లకు ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి. తారకరత్న మరణంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. తండ్రి మరణంతో పిల్లలకు దిక్కు లేకుండాపోయింది. దాంతో ఆ పిల్లల బాధ్యత పూర్తిగా నేనే తీసుకుంటాను …..అన్నీ నేనే దగ్గరుండి మరీ చూసుకుంటాను అని హామీ ఇచ్చాడట.
బాలయ్య కు అబ్బాయ్ తారకరత్న అంటే చాలా చాలా ఇష్టం . దాంతో అతడ్ని హీరోగా నిలబెట్టాలని గట్టి ప్రయత్నాలే చేసాడు కానీ కుదరలేదు. అలాగే జనవరి 27 న గుండెపోటుకు గురైనప్పటి నుండి బాలయ్యే అన్నీ దగ్గరుండి చూసుకున్నాడు. 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడి చివరకు అర్దాంతరంగా తనువు చాలించాడు తారకరత్న. దాంతో బాలయ్య తారకరత్న పిల్లల బాధ్యత తీసుకోవడానికి ముందుకు వచ్చాడు.