
నటసింహం నందమూరి బాలకృష్ణ ఆర్ ఆర్ ఆర్ చిత్ర బృందం పై ప్రశంసలు కురిపించాడు. నిన్న ఆస్కార్ నామినేషన్ ల తుది జాబితా విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగా ఆ జాబితాలో మూడు భారతీయ చిత్రాలకు చోటు లభించగా ఆర్ ఆర్ ఆర్ చిత్రంలోని ” నాటు నాటు ” అనే పాటకు ఒరిజినల్ సాంగ్ కేటగిరీ లో స్థానం లభించింది.
నాటు నాటు సాంగ్ తో పాటుగా మరో నాలుగు చిత్రాల్లోని పాటలు కూడా పోటీకి వచ్చాయి. ఇక అసలైన సమరం మార్చి 1 3 న జరుగనుంది. ఆర్ ఆర్ ఆర్ చిత్రం ఆస్కార్ బరిలో నిలివడంతో బాలయ్య అభినందనలు కురిపించాడు. ఆమేరకు పత్రికా ప్రకటన విడుదల చేసాడు. ఆర్ ఆర్ ఆర్ తో పాటుగా మిగతా రెండు భారతీయ చిత్రాలకు కూడా అభినందనలు తెలిపాడు బాలయ్య.