నటసింహం నందమూరి బాలకృష్ణ అక్కడా ఇక్కడా అనే తేడాలేకుండా అన్ని చోట్లా దూసుకుపోతున్నాడు. 60 ప్లస్ ఏజ్ లో బాలయ్య తన రేంజ్ ని పెంచుకుంటూ పోతున్నాడు. బాలయ్య సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా సత్తా చాటారు. అలాగే ఆహా కోసం అన్ స్థాపబుల్ షో చేసి సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇక ఇప్పుడేమో రియల్ ఎస్టేట్ రంగంలో కూడా అడుగుపెట్టాడు బాలయ్య.
సాయి ప్రియ రియల్ ఎస్టేట్ కోసం బ్రాండ్ అంబాసిడర్ గా మారాడు బాలయ్య. తాజాగా ఈ యాడ్ కు సంబంధించిన కార్యక్రమం రసవత్తరంగా జరిగింది. ఈ యాడ్ కు అద్భుత స్పందన లభించింది. బాలయ్య రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం బ్రాండ్ అంబాసిడర్ గా మారడం సంచలనంగా మారింది. ఇక ఈ యాడ్ లో నటించడానికి బాలయ్య ఏకంగా 15 కోట్ల రెమ్యునరేషన్ అందుకోవడం సంచలనంగా మారింది. ఇలా అందుకున్న 15 కోట్లను బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి విరాళంగా ఇచ్చాడు బాలయ్య.
ఇంత భారీ సొమ్ము తన క్యాన్సర్ ఆసుపత్రికి విరాళంగా ఇవ్వడం గొప్ప విషయమే మరి. యాడ్ సంగతి పక్కన పెడితే తాజాగా వీర సింహా రెడ్డి చిత్రం చేస్తున్నాడు. ఆ సినిమా 2023 జనవరిలో సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.