నందమూరి బాలకృష్ణ అక్కినేని అభిమానులకు క్షమాపణ చెబుతున్నట్లుగా ఫేక్ లెటర్ క్రియేట్ చేశారు. ఆ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఆ లెటర్ లో ఘోరమైన బూతులు ఉన్నాయి. నాకు మతి స్థిమితం లేదని , నాగచైతన్య, అఖిల్ లాంటి చిన్న వాళ్ళతో బుద్ధి చెప్పించుకోవాల్సి వచ్చిందని ఇకపై ఇలాంటి తప్పు చేయనని , క్షమించాలని వేడుకున్నట్లు ఓ ఫేక్ లెటర్ క్రియేట్ చేశారు. ఈ లెటర్ చూస్తే తప్పకుండా ఫేక్ అని అర్ధమవుతుంది. ఎందుకంటే ఘోరమైన బూతులు ఉన్నాయి మరి.
ఇటీవల బాలయ్య నటించిన వీరసింహారెడ్డి చిత్ర విజయోత్సవ వేడుకలో బాలయ్య నోరు జారాడు. అక్కినేని….. తొక్కినేని అంటూ బాలయ్య మాట్లాడిన మాటలు అక్కినేని అభిమానులను తీవ్ర అసంతృప్తికి లోనయ్యేలా చేసాయి. దాంతో అక్కినేని అభిమానులు బాలయ్య పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే వేడుకలో ఎస్వీఆర్ గురించి కూడా టంగ్ స్లిప్ అయ్యాడు దాంతో కాపు నాడు కూడా వార్నింగ్ ఇచ్చింది. తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. బాలయ్య నుండి సరైన స్పందన లేకపోవడంతో ఇలా ఫేక్ లెటర్ సృష్టించారు…… బహుశా అక్కినేని అభిమానులు ఇలా చేసి ఉంటారని భావిస్తున్నారు.