బాలయ్య ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేసారు. దాంతో షో నిలిపివేయాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలుసా ……. అనకాపల్లిలో కాదు సుమా ……… అమెరికాలో. జై బాలయ్య …… జై బాలయ్య నినాదాలతో ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి. ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా వీరసింహారెడ్డి భారీ ఎత్తున విడుదలైన విషయం తెలిసిందే. దాంతో అన్ని చోట్లా జై బాలయ్య అనే నినాదాలతో హంగామా చేస్తున్నారు బాలయ్య ఫ్యాన్స్.
ఇక అమెరికాలో కూడా సినిమా ప్రదర్శిస్తున్న సమయంలో జై బాలయ్య …. జై జై బాలయ్య అంటూ పెద్ద ఎత్తున గోల చేయడంతో పాటుగా కాగితాలను చల్లారు. ఈ గోల ఎక్కువ కావడంతో వెంటనే సినిమా ప్రదర్శన నిలిపివేసి నినాదాలు ఇవ్వొద్దని చెప్పారు. అయినప్పటికీ జై బాలయ్య స్లొగన్స్ ఆగకవడంతో పోలీసులు రంగప్రవేశం చేసారు. నినాదాలు చేస్తున్న వాళ్ళను థియేటర్ నుండి బయటకు పంపారు.