నటసింహం నందమూరి బాలకృష్ణ యమా స్పీడ్ లో ఉన్నాడు. ఒక సినిమా పూర్తి కాకుండానే మరో సినిమాను పట్టాలెక్కిస్తున్నాడు. వీర సింహా రెడ్డి చిత్రం పూర్తి కాకముందే అనిల్ రావిపూడి సినిమా స్టార్ట్ అయ్యింది. ఈ సినిమా పూర్తి కాకముందే మరో రెండు ప్రాజెక్ట్ లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు బాలయ్య. బోయపాటి శ్రీనుతో మరో సినిమా ను ఓకే చేసాడు. ఇక తాజాగా వినబడుతున్న కథనం ప్రకారం బింబిసార దర్శకుడు వశిష్ఠతో బాలయ్య ఓ సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది.
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన బింబిసార బ్లాక్ బస్టర్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాను చూసిన బాలయ్య అప్పుడే మనం తప్పకుండ చేద్దాం …… మంచి కథ ఉంటే చెప్పమని అన్నాడు కూడా. ఇంకేముంది బాలయ్య లాంటి స్టార్ హీరో చేద్దామని , కథ చెప్పమంటే సైలెంట్ గా ఎందుకు ఉంటాడు …… కథ రెడీ చేసాడు. దాంతో బాలయ్య కు ఇటీవల కథ చెప్పాడట….. విన్నాక బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.
ఇక ఈ చిత్రాన్ని నిర్మించడానికి పలువురు నిర్మాతలు పోటీ పడుతున్నారు. అయితే అందులో ఫిల్టర్ చేయగా రెండు బ్యానర్లు మాత్రం లైన్ లో ఉన్నాయి. ఒకటేమో అగ్ర నిర్మాత అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ కాగా మరొకటి నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్. బాలయ్య బాబాయ్ తో సినిమా చేయాలని ఎప్పటి నుండో అనుకుంటున్నాడు కళ్యాణ్ రామ్. మరి ఈ సినిమాను కళ్యాణ్ రామ్ కు ఇస్తాడా ? అల్లు అరవింద్ కు ఇస్తాడా ? అన్నది చూడాలి.