
డార్లింగ్ ప్రభాస్ బాహుబలి ఎపిసోడ్ ఓటీటీ లో ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఓటీటీ చరిత్రలో సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది అన్ స్టాపబుల్ 2 . నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న షో అన్ స్టాపబుల్ 2”. ఆహా కోసం చేస్తున్న ఈ షో ఇండియన్ హిస్టరీలోనే సరికొత్త చరిత్ర సృష్టించింది. దేశంలోనే నెంబర్ వన్ షోగా నిలిచింది.
ఇక ఇన్నాళ్లు ఒక లెక్క ఇకనుండి ఒకలెక్క ……. ప్రభాస్ వచ్చాడని చెప్పండి …… ప్రభాస్ వచ్చాడని చెప్పండి అన్నట్లుగానే ఉంది అన్ స్టాపబుల్ 2 షో. మిర్చి సినిమాలోని డైలాగ్ ను ఇలా అన్వయించుకోవచ్చు ఎందుకంటే ఇన్నాళ్లు బాలయ్య అన్ స్టాపబుల్ షో లెక్క వేరు ……. బాహుబలి ప్రభాస్ ఎపిసోడ్ చేస్తున్న మ్యాజిక్ వేరు. మొదటి సీజన్ బ్లాక్ బస్టర్ కావడంతో ఇక జనవరి 6 న రెండో ఎపిసోడ్ కూడా స్ట్రీమింగ్ కు వస్తోంది.
ఇక ఈ రెండో స్ట్రీమింగ్ జనవరి 6 న వస్తుండటంతో ప్రోమో రిలీజ్ చేసారు. ఇక ఈ ప్రోమో కూడా దద్దరిల్లిపోతోంది. ప్రోమో అద్భుతంగా ఉండటంతో బాహుబలి రెండో ఎపిసోడ్ ఓటీటీని మరింత షాక్ అయ్యేలా చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రభాస్ చాలా మొహమాటస్తుడు అలాంటి ప్రభాస్ చేత ఓపెన్ అయ్యేలా చేసాడు బాలయ్య. దాంతో ఈ షో సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది.