నటసింహం నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ 2 షో తాజా ఎపిసోడ్ ప్రోమో వచ్చేసింది. ఈ షోలో బాహుబలి ప్రభాస్ గెస్ట్ అనే విషయం తెలిసిందే. ఈ ప్రోమో అదిరిపోయింది అంతే ! బాలయ్య తనదైన శైలిలో ప్రశ్నలు వేయడం ……. అలాగే డార్లింగ్ ప్రభాస్ అదే జోరులో సమాధానాలు చెప్పడం ప్రేక్షకులను విశేషంగా అలరించేలా ఉంది.
ప్రోమో అదిరిపోయే రేంజ్ లో ఉండటంతో ఈ ఎపిసోడ్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ ఎపిసోడ్ ను డిసెంబర్ 30 న స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఇదే విషయాన్ని ప్రోమోలో ప్రకటించారు ఆహా టీమ్. ఇక ఈ షోలో డార్లింగ్ ప్రభాస్ తో పాటుగా హీరో గోపీచంద్ కూడా పాల్గొన్న విషయం తెలిసిందే.
గోపీచంద్ ను బాలయ్య ఆప్యాయంగా ఆలింగనం చేసుకోవడం అతడికి ధైర్యం చెప్పడం ….. అలాగే ప్రభాస్ తన పెద్ద నాన్న కృష్ణంరాజును తలచుకొని ఉద్వేగానికి లోనైన సమయంలో సైతం బాలయ్య ప్రభాస్ ను ఆలింగనం చేసుకున్నాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. డార్లింగ్ ప్రభాస్ మాటలు అభిమానులను పరవశింపజేసేలా ఉన్నాయి. మొత్తానికి ఈ ఎపిసోడ్ రికార్డుల మోత మోగించడం ఖాయంగా కనిపిస్తోంది.