నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న షో అన్ స్టాపబుల్ . మొదటి సీజన్ రికార్డుల మోత మోగించింది. దాంతో రెండో సీజన్ స్టార్ట్ చేశారు. ఇక ఈ రెండో సీజన్ లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ను ఇంటర్వ్యూ చేసాడు బాలయ్య. ఈరోజు బాలయ్య – ప్రభాస్ ల మధ్య ఎపిసోడ్ జరుగుతోంది. దాంతో అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించారు ఆహా టీమ్. అంతేకాదు ఓ ప్రోమో కూడా రిలీజ్ చేశారు.
అయితే మొదట ఈ ఎపిసోడ్ లో ప్రభాస్ తో పాటుగా హీరో గోపీచంద్ కూడా పాల్గొననున్నారని భావించారు. కానీ ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం డార్లింగ్ ప్రభాస్ మాత్రమే ఈ ఎపిసోడ్ కు హాజరయ్యాడు. ఇక ఈ ఎపిసోడ్ ను న్యూ ఇయర్ కానుకగా డిసెంబర్ 30 న లేదంటే జనవరి 1 న స్ట్రీమింగ్ కి తీసుకురావాలని చూస్తున్నారట ఆహా సిబ్బంది. ఇక ఈ ఎపిసోడ్ ప్రసారమైతే రికార్డుల మోత మోగించడం ఖాయం. ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ కావడంతో తప్పకుండా సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయం.
బాలయ్య అన్ స్టాపబుల్ షోతో సరికొత్త అవతారానికి తెరతీశారు. ఇన్నాళ్లు బాలయ్య అంటే కోపిష్టి అని , ఎవరితో చనువుగా మాట్లాడరని , ఒకవేళ దగ్గరకు వెళితే కొడతాడాని ఇలా రకరకాల ప్రచారాలు ఉన్నాయి. అయితే అలాంటి ఆలోచనలు పెట్టుకున్న వాళ్లకు బాలయ్య అంటే ఇంత ఆప్యాయతా ? ఇంతటి అభిమానం కురిపిస్తాడా ? అంటూ ఆశ్చర్యపోతున్నారు నెటిజన్లు….. అలాగే కొందరు సెలబ్రిటీలు సైతం. బాలయ్య అన్ స్టాపబుల్ షో ……. టాక్ షోలన్నింటికి బాప్ అయి కూర్చుంది.